Model alesia raut back with a b wood number

Model Alesia Raut back with a B’wood number

Model Alesia Raut back with a B’wood number

Alesia 1.gif

Posted: 06/14/2012 03:13 PM IST
Model alesia raut back with a b wood number

Model Alesia Raut back with a B’wood number

ఐశ్వర్యారాయ్, కత్రినాకైఫ్, ప్రియాంక చోప్రా, బిపాసా బసు... సయాలీభగత్, గీతా బాస్రా, ముగ్ధాగాడ్సే, జియాఖాన్.. ఈ తారల బాలీవుడ్ రంగప్రవేశానికి ముందు జీవితాన్ని పరిశీలిస్తే ఓ సారూప్యం మనకు తెలుస్తుంది. అదేమంటే వీరందరూ మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌కు పరిచయమైనవారే. వీరిలో తొలి నలురిని ఇప్పటికీ బాలీవుడ్ అగ్రకథానాయికలుగా చెప్పుకుంటున్నారు. మిగతావారికి సరైన అవకాశాలు రాకున్నా ఇంతో అంతో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... బాలీవుడ్‌కు రావాలన్న కోరిక ఉన్న ప్రతిఒక్కరూ ముందుగా మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు.

నటించాలనుకున్నప్పుడు యాక్టింగ్ స్కూల్స్‌లో చేరొచ్చుకదా? అని వారిని ప్రశ్నిస్తే... ఇప్పుడున్న బాలీవుడ్ తారల్లో చాలా మంది మోడలింగ్ రంగం నుంచి వచ్చినవారేనని, అగ్రనాయికలుగా చెలామణి అవుతున్న వారు కూడా ఆ తాను ముక్కలేనని, మేము కూడా మోడలింగ్ రంగంలోకి వస్తున్నది బాలీవుడ్‌లోకి రావాలనే కోరికతోనేనని చెబుతున్నారు. ఈ విషయమై వర్ధమాన మోడల్ అలేసియా రౌత్ మాట్లాడుతూ... ‘బాలీవుడ్‌లో పాత్రల పరిధి ఎప్పటినుంచైతే పెరిగిందో అప్పటి నుంచి మోడల్స్ నటులుగా మారిపోతూనే ఉన్నారు. ప్రస్తుతం మోడల్ రంగంలో కొనసాగుతున్నవారందరూ బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఆ సినిమా పెద్ద నిర్మాణసంస్థకు చెందినదా? చిన్న సంస్థ ఆ సినిమాను నిర్మిస్తోందా? చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉందా? లేదా? అనే విషయాలను పక్కనబెట్టేస్తున్నారు. బాలీవుడ్‌లో అవకాశం వచ్చిందంటేచాలు వెంటనే అంగీకరిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. మోడలింగ్ రంగం పరిధి బాలీవుడ్ అంత విస్తృతమైనది కాదు. పైగా ఆ రంగంలో ఎక్కువ కాలం కొనసాగలేం. ఎప్పటికైనా మరో అవకాశం కోసం ప్రయత్నించాల్సిందే. అలాంటప్పుడు బాలీవుడ్‌నే ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటే తప్పేంటి? హీరోయిన్‌గా, ఐటమ్ గర్ల్‌గా, సహాయక న టులుగా చాలా కాలం కొనసాగే అవకాశం బాలీవుడ్‌లో ఉంటుంది. అందుకే మోడల్స్ బాలీవుడ్‌ను మోడలింగ్ అనంతరం కెరీర్‌గా ఎంచుకుంటున్నార’ని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman khan met pawan kalyan at chiranjeevis house
Charity begins at home for ram charan and upasna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more